35. ముప్పది ఐదవ అధ్యాయము
ముఖ్యమగు సర్పముల నామములు.
శౌనక ఉవాచ
భుజంగమానాం శాపస్య మాత్రా చైవ సుతేన చ ।
వినతాయాస్త్యయా ప్రోక్తం కారణం సూతనందన ॥ 1
సూతనందనా! కద్రూ పుత్రుల శాపకారణాన్ని, వినతకు గల శాపకారణాన్ని మీవల్ల విన్నాము. (1)
వరప్రదానం భర్త్రా చ కద్రూవినతయోస్తథా ।
నామనీ చైవ తే ప్రోక్తే పక్షిణే వైనతేయయోః ॥ 2
కద్రువ వినత తమ భర్తవలన వరాల్ని పొందటం, వినతకు ఇద్దరు పుత్రులు కల్గటం, వారి పేర్లను కూడా తెలియజేయటం జరిగింది. (2)
పన్నగానాం తు నామాని న కీర్తయసి సూతజ ।
ప్రాధాన్యే నామాని శ్రోతుమిచ్ఛామహే వయమ్ ॥ 3
మహానుభావా! పన్నగుల పేర్లు మాత్రం మాకు మీరు తెలియజేయలేదు. ముఖ్యులయిన సర్పాల పేర్లను తెలియజేయండి. వినాలని అనుకొంటున్నాము. (3)
సౌతిరువాచ
బహుత్వాన్నామధేయాని పన్నగానాం తపోధన ।
న కీర్తయిష్యే సర్వేషాం ప్రాధాన్యేన తు మే శృణు ॥ 4
తపోధనా! అన్ని సర్పాలపేర్లను చెప్పజాలను. ప్రధానమైనవాటి పేర్లను మాత్రం చెప్పుతాను. (4)
శేషః ప్రథమతో జాతః వాసుకిస్తదనంతరమ్ ।
ఐరావతస్తక్షకశ్చ కర్కోటక ధనంజయౌ ॥ 5
కాళియో మణినాగశ్చ నాగశ్చాపూరణస్తథా ।
నాగస్తథా పింజరకః ఏలాపత్రోఽథ వామనః ॥ 6
నీలానీలౌ తథా నాగౌ కల్మాష శబలౌ తథా ।
ఆర్యకశ్చోగ్రశ్పైవ నాగః కలశాపోతకః ॥ 7
సుమనాఖ్యో దధిముఖః తథా విమలపిండకః ।
ఆప్తః కర్కోటకశ్చైవ శంఖో వాలిశిఖస్తథా ॥ 8
నిష్ఠానకో హేమహుహః నహుషః పింగలస్తథా ।
బాహ్యకర్ణొ హస్తిపదః తథా ముద్గరపిండకః ॥ 9
కంబలాశ్వతరౌ చాపి నాగః కాలీయకస్తథా ।
వృత్తసంవర్తకౌ నాగౌ ద్వౌ చ పద్మావితి శ్రుతౌ ॥ 10
నాగః శంఖముఖశ్పైవ తథా కూష్మాండకోఽ పరః ।
క్షేమకశ్చ తథా నాగః నాగః పిండారకస్తథా ॥ 11
కరవీరః పుష్పదంష్ట్రః బిల్వకో బిల్వపాండురః ।
మూషకాదః శంఖశిరాః పూర్ణభద్రో హరిద్రకః ॥ 12
అపరాజితో జ్యోతికశ్చ పన్నగః శ్రీవహస్తథా ।
కౌరవ్యో ధృతరాష్ట్రశ్చ శంఖపిండశ్చ వీర్యవాన్ ॥ 13
విరజాశ్చ సుబాహుశ్చ శాలిపిండశ్చ వీర్యవాన్ ।
హస్తిపిండః పిఠరకః సుముఖః కౌణపాశనః ॥ 14
కుఠరః కుంజరశ్పైవ తథా నాగః ప్రభాకరః ।
కుముదః కుముదక్షశ్చ తిత్తిరిర్హలికస్తథా ॥ 15
కర్దమశ్చ మహానాగః నాగశ్చ బహుమూలకః ।
కర్కరాకర్కరౌ నాగౌ కుండోదరమహోదరౌ ॥ 16
సర్పాలలో ముందుగా పేర్కొన దగినవాడు శేషుడు, తరువాత వాసుకి, ఐరావతుడు, తక్షకుడు, కర్కోటకుడు, ధనంజయుడు, కాలియుడు, మణినాగుడు, ఆపూరణుడు, పింజరకుడు, ఏలాపత్రుడు, వామనుడు, నీలుడు, అనీలుడు, కల్మాషుడు, శబలుడు, ఆర్యకుడు, ఉగ్రకుడు, కలశపోతకుడు, సుమనాఖ్యుడు, దధిముఖుడు, విమలపిండకుడు, ఆప్తుడు, కర్కోటకుడు (రెండవవాడు), శంఖుడు, వాలిశిఖుడు, నిష్ఠానకుడు, హేమగుహుడు, నహుషుడు, పింగలుడు, బాహ్యకర్ణుడు, హస్తిపదుడు, ముద్గరపిండకుడు, కంబలుడు, అశ్వతరుడు, కాళీయకుడు, వృత్తుడు, సంవర్తకుడు, పద్ముడు (ప్రథమ), పద్ముడు (ద్వితీయ), శంఖముఖుడు, కూష్మాండకుడు, క్షేమకుడు, పిండారకుడు, కరవీరుడు, పుష్పదంష్ట్రుడు, బిల్వకుడు, బిల్వపాండురుడు, మూషకాదుడు, శంకశిరుడు, పూర్ణభద్రుడు, హరిద్రకుడు, అపరాజితుడు, జ్యోతికుడు, శ్రీవహుడు, కౌరవ్యుడు, ధృతరాష్ట్రుడు, శంకపిండుడు, హస్తిపిండుడు, పిఠరకుడు, సుముఖుడు, కౌణపాశనుడు, కుఠరుడు, కుంజరుడు, ప్రభాకరుడు, కుముదుడు, కుముదాక్షుడు, తిత్తిరి, హలికుడు, మహానాగకర్దముడు, బహుమూలకుడు, కర్కరుడు, అకర్కరుడు, కుండోదరుడు, మహోదరుడు-వీరందరు నాగులు. (5-16)
ఏతే ప్రాధాన్యతో నాగాః కీర్తితాః ద్విజసత్తమ ।
బహుత్వాన్నామధేయానామ్ ఇతరే నామకీర్తితాః ॥ 17
బ్రాహ్మణోత్తమా! అతిముఖ్యమైన నాగులపేర్లను మాత్రమే చెప్పాను. పేర్లు అధికంగానే ఉన్నాయి. అందుచేత అప్రధానులయిన వాళ్ల పేర్లను ఇక్కడ చెప్పలేదు. (17)
ఏతేషాం ప్రసవో యశ్చ ప్రసవస్య చ సంతతిః ।
అసంఖ్యేయేతి మత్వా తాన్ న బ్రవీమి తపోధన ॥ 18
తపోధనా! ఈ నాగులయొక్క సంతానం, మరల వారి యొక్క సంతానం అసంఖ్యాకంగా ఉన్నది. అందుచేత వాళ్ల పేర్లను చెప్పలేదు. (18)
బహూనీహ సహస్రాణి ప్రయుతాన్యర్బుదాని చ ।
అశక్యాన్యేవ సంఖ్యాతుం పన్నగానాం తపోధన ॥ 19
శౌనకమహర్షీ! నాగులసంఖ్య వేలు, లక్షలు, కోట్లు అని లెక్కపెట్టడానికి వీలులేనంతగా ఉన్నది. (19)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి సర్పనామకథనే పంచత్రింశోఽధ్యాయః ॥ 35 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఆస్తీకపర్వమను ఉపపర్వమున సర్పనామకథనము అను ముప్పది ఐదవ అధ్యాయము. (35)