111. నూట పదకొండవ అధ్యాయము
వేశ్యలు ఋష్యశృంగుని ప్రలోభపరచుట - విభాండకుడు పుత్రుని చింతకు కారణమడుగుట.
లోమశ ఉవాచ
సా తు నావ్యాశ్రమం చక్రే రాజకార్యార్థసిద్ధయే ।
సందేశాచ్చైవ నృపతేః స్వబుద్ధ్యా చైవ భారత ॥ 1
లోమశుడు పలికాడు.
భారతా! ఆమె రాజకార్యసాధనకై రాజాజ్ఞను అనుసరించి, తన బుద్ధితో ఆలోచించి, ఒక నావపై సుందర ఆశ్రమం నిర్మించింది. (1)
నానాపుష్పఫలైర్వృక్షైః కృత్రిమైరుపశోభితైః ।
నానాగుల్మలతోపేతైః స్వాదుకామఫలప్రదైః ॥ 2
ఆ ఆశ్రమం వారు కల్పించిన వివిధ పుష్పఫల వృక్షాలతో శోభిస్తోంది. రకరకాల తీగెలతో పుష్పవక్షాలు, రసవంతమయిన ఫలాలతో ఫలవృక్షాలు కనిపిస్తున్నాయి. (2)
అతీవ రమణీయం తద్ అతీవ చ మనోహరమ్ ।
చక్రే నావ్యాశ్రమం రమ్యమ్ అద్భుతోపమదర్శనమ్ ॥ 3
తతో నిబధ్య తాం నావమ్ అదూరే కాశ్యపాశ్రమాత్ ।
చారయామాస పురుషైః విహారం తస్య వై మునేః ॥ 4
అది అత్యంతం సుందరమై, మనోహరమై ఉంది. వేశ్య నావపై సుందరాశ్రమాన్ని నిర్మించింది. అది చూడముచ్చటగా ఉంది. ఆ నావను కాశ్యపాశ్రమానికి దూరంలో కట్టి గూఢచారులను పంపి విషయం గ్రహించి రమ్మంది. ఆ సమయంలో విభాండకముని ఆశ్రమంలో లేడు. (3,4)
తతో దుహితరం వేశ్యాం సమాధాయేతికార్యతామ్ ।
దృష్ట్వాంతరం కాశ్యపస్య ప్రాహిణోద్ బుద్ధిసమ్మతామ్ ॥ 5
సా తత్ర గత్వా కుశల్ తపోనిత్యస్య సన్నిధౌ ।
ఆశ్రమం తం సమాసాద్య దదర్శ తమృషేః సుతమ్ ॥ 6
విభాండకుడు ఆశ్రమంలో లేడని గ్రహించి ఆ వేశ్య బుద్ధిమంతురాలు అయిన తన కుమార్తెని పిలిచి చేయవలడిన పనిని ఆదేశించింది. ఆమె కార్యసాధనలో నిపుణురాలు. ఆమె ఆశ్రమానికి వెళ్ళి నిరంతరం తపస్సులో లీనమయిన ఋష్యశృంగుని చూచింది. (5,6)
వేశ్యోవాచ
కచ్చిన్మునే కుశలం తాపసానాం
కచ్చిచ్చ వో మూలఫలం ప్రభూతమ్ ।
కచ్చిద్ భవాన్ రమతే చాశ్రమేఽస్మిన్
త్వాం వై ద్రష్టుం సాంప్రతమాగతోఽస్మి ॥ 7
తాపసా! తాపసులందరు క్షేమమేనా? దుంపలు, పళ్ళు అధికంగా ఈ ప్రదేశంలో లభిస్తున్నాయా? నీకు ఈ ఆశ్రమమ్ ప్రసన్నంగా ఉందా? నేను ఇప్పుడు ప్రత్యేకంగా మిమ్ములను చూడడానికి వచ్చాను. (7)
కచ్చిత్ తపో వర్ధతే తాపసానాం
పితా చ తే కచ్చిఇదహీనతేజాః ।
కచ్చిత్ త్వయా ప్రీయతే చైవ విప్ర
కచ్చిత్ స్వాధ్యాయః క్రియతే చర్ష్యశృంగ ॥ 8
ఋష్యశృంగా! తాపసుల తపస్సు వృద్ధిని పొందుతున్నదా? నీ తండ్రి తేజస్సంపన్నుడు అవుతున్నాడా? మీరు ఆనందం అనుభవిస్తున్నారా? మీ స్వాధ్యాయం సక్రమంగా సాగుతోందా? (8)
ఋష్యశృంగ ఉవాచ
బుద్ధ్యా భవాన్ జ్యోతిరివ ప్రకాశతే
మన్యే చాహం త్వామభివాదనీయమ్ ।
పాద్యం వై తే సంప్రదాస్యామి కామాద్
యథాధర్మం ఫలమూలాని చైవ ॥ 9
ఋష్యశృంగుడు పలికాడు.
మీరు మీ సమృద్ధిచే జ్యోతివలె వెలుగుతున్నారు. నేను మిమ్ములను వందనీయులని భావిస్తున్నాను. ధర్మాన్ని అనుసరించి స్వేచ్ఛగా మీకు అర్ఘ్యపాద్యాదులు, ఫలమూలాలు అర్పిస్తున్నాను. (9)
కౌశ్యాం బృష్యామాస్స్వ యథోపజోషం
కృష్ణాజినేనావృతాయాం సుఖాయామ్ ।
క్వ చాశ్రమస్తవ కిం నామ చేదం
వ్రతం బ్రహ్మంశ్చరసి హి దేవవత్ త్వమ్ ॥ 10
మీరు దర్భాసనంపై కూర్చోండి. దీనిపై నల్లరేడి చర్మం పరచబడింది. కావున దీనిపై ఆసీనులై విశ్రాంతిని పొందుతారు. బ్రహ్మా! దేవతాసమానులైన మీరు ఏ వ్రతాన్ని పాలిస్తున్నారు. (10)
వేశ్యోవాచ
మమాశ్రమః కాశ్యపపుత్ర రమ్యః
త్రియోజనం శైలమిమం పరేణ ।
తత్ర స్వధర్మో నాభివాదనం మే
న చోదకం పాద్యముపస్పృశామి ॥ 11
వేశ్య పలికింది.
కశ్యపగోత్రజుడా! నా ఆశ్రమం అందమైంది. ఈ పర్వతానికి ఆవలివైపున మూడు యోజనాల దూరంలో ఉంది. నా ధర్మాన్ని అనుసరించి మీరు నాకు నమస్కరించిన పనిలేదు. నేను మీరిచ్చిన అర్ఘ్యపాద్యాదులను స్పృశింపను. (11)
భవతా నాభివద్యోఽహమ్ అభివాద్యో భవాన్ మయా ।
వ్రతమేతాదృశం బ్రహ్మన్ పరిష్వజ్యో భవాన్ మయా ॥ 12
నేను మీచే నమస్కరింపతగను. మీరే నాకు నమస్కరింపతగినవారు. ఇది మా వ్రతస్వరూపం. మిరు మాకు కౌగిలింపదగినవారు. (12)
ఋష్యశృంగ ఉవాచ
ఫలాని పక్వాని దదాని తేఽహం
భల్లాతకాన్యామలకాని చైవ ।
కరూషకాణీంగుదధన్వనాని
పిప్పలానాం కామకారం కురుష్వ ॥ 13
ఋష్యశృంగుడు పలికాడు - నేను నీకు పండిన పండ్లను ఇస్తాను. జీడిమామిడులు, ఉసిరికలు, పిప్పలాలు, గారఫలాలు, మొదలైన అనేకఫలాలు ఉన్నాయి. మీకు ఇష్టమైన వాటిని గ్రహించండి. (13)
లోమశ ఉవాచ
సా తాని సర్వాణి వివర్జయిత్వా
భక్ష్యాణ్యనర్హాణి దదౌ తతోఽస్య ।
తానృష్యశృంగస్య మహారసాని
భృశం సురూపాణి రుచిం దదుర్హి ॥ 14
లోమశుడు పలికాడు - ఆ వేశ్యవాటిని విడచి ఋష్యశృంగునికి రుచికరాలు, అమూల్యాలు అయిన భక్ష్యవిశేషాల నిచ్చింది. అవి అతనికి వాటిపై రుచిని పెంచాయి. (14)
దదౌ చ మాల్యాని సుగంధవంతి
చిత్రాణి వాసాంసి చ భానుమంతి ।
పేయాని చాగ్ర్యాణి తతో ముమోద
చిక్రీడ చైవ ప్రజహాస చైవ ॥ 15
సుగంధభరితాలైన మాలలు, చాలా రంగులతో ప్రకాశించే బట్టలు, త్రాగడానికి వీలైన రసాలు ఇస్తే అతడు ఆనందింది, వాటిని అనుభవించి, వెంటవెంటనే నవ్వసాగాడు. (15)
సా కందుకేనారమతాస్య మూలే
విభజ్యమానా ఫలితా లతేవ ।
గాత్రైశ్చ గాత్రాణి నిషేవమాణా
సమాశ్లిషచ్చాసకృదృష్యశృంగమ్ ॥ 16
వేశ్య ఆయన సమీపంలో బంతితో ఆడింది. తన అవయవాలు అతనికి తాకిస్తూ చెట్టు నుంచి విడి క్రింద పడిన లతవలె మాటిమాటికి ఋష్యశృంగుని కౌగిలించుకొంది. (16)
సర్జానశోకాంస్తిలకాంశ్చ వృక్షాన్
సుపుష్పితానవనామ్యావభజ్య ।
విలజ్జమానేవ మదాభిభూతా
ప్రలోభయామాస సుతం మహర్షేః ॥ 17
మిక్కిలి పుష్పించిన శాల, అశోక, తిలకవృక్షాలను వంచి, పుష్పాలను కురిపించి మదవతి వలె సిగ్గుపడి ఆ విభాండకపుత్రుని ప్రలోభపెట్టింది. (17)
పుత్రుని సమీపానికి వచ్చి ఒంటరియై ఉదాసీనుడై ఆమెనే ధ్యానిస్తున్న దీనుడైన కుమారుణ్ణి చూశాడు. అతడి మనస్సు విపరీతమైన దశలో ఉంది. మాటిమాటికి నిట్టూరుస్తూ పైకి చూస్తూ కనిపించాడు. 'నాయనా! సమిధలు సిద్ధం చేసి అగ్నిహోత్రం వెలిగించలేదేమి? స్రుక్ర్సువాలు శుభ్రం చేయలేదు! దూడతో కూడిన హోమధేనువును తీసుకురాలేదు. కారణం ఏమిటి? నేడు నీవు ఇదివరకటి ఋష్యశృంగునిలా లేవు. ఏదో అలోచిస్తూ చైతన్యం కోల్పోయి దీనుడివై ఉన్నావు. నేను లేనప్పుడు ఆశ్రమంలో ఎవరైనా ప్రవేశించారా? చెప్పు! అన్నాడు. (21-23)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయామృష్యశృంగోపాఖ్యానే వృత్రవధోపాఖ్యానే ఏకాదశాధికశతతమోఽధ్యాయః ॥ 111 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రాపర్వమను ఉపపర్వమున లోమశతీర్థయాత్రలో ఋష్యశృంగ కథ అను నూట పదకొండవ అధ్యాయము. (111)