9. తొమ్మిదవ అధ్యాయము
భారతవర్ష మందలి నదీ, ప్రదేశములు - భారతభూమి మహత్త్వము.
ధృతరాష్ట్ర ఉవాచ
యదిదం భారతం వర్షం యత్రేదం మూర్ఛితం బలమ్ ।
యత్రాతిమాత్రలుబ్ధోఽయం పుత్రో దుర్యోధనో మమ ॥ 1
యత్ర గృద్ధాః పాండుపుత్రాః యత్ర మే సజ్జతే మనః ।
ఏతన్మే తత్త్వమాచక్ష్వ త్వం హి మే బుద్ధిమాన్ మతః ॥ 2
ధృతరాష్ట్రుడు ఇలా అంటున్నాడు.
'సంజయా! ఈ భారత వర్షంలో రాజులంతా యుద్ధానికి ఒక చోట చేరారు. నా కొడుకు దుర్యోధనుడూ రాజ్యలోభంతో ఇక్కడ చేరాడు. పాండుపుత్రులూ అదే కోరికతో ఉన్నారు. (నిజానికి) నా మనస్సూ ఆసక్తితోనే ఉంది. నీవు బుద్ధి మంతుడవు. ఈ భారత వర్షాన్ని గురించి నాకు చెప్పు.' (1,2)
సంజయ ఉవాచ
న తత్ర పాండవా గృద్ధాః శృణు రాజన్ వచో మమ ।
గృద్ధో దుర్యోధనస్తత్ర శకునిశ్చాపి సౌబలః ॥ 3
సంజయుడు ఆరంభించాడు.
'రాజా! నా మాట విను. పాండవులకు రాజ్యలోభం లేదు. దుర్యోధనుడూ, శకునీ రాజ్యలోభంతో ఉన్నారు. (3)
అపరే క్షత్రియాశ్చైవ నానాజనపదేశ్వరాః ।
యే గృద్ధా భారతే వర్షే న మృష్యంతి పరస్పరమ్ ॥ 4
ఇంకా అనేక దేశాల రాజులు కూడా భారతవర్షం మీద లోభంతో ఒకరినొకరు చూసి, సహింపలేకపోతున్నారు. (4)
అత్ర తే కీర్తయిష్యామి వర్షం భారత భారతమ్ ।
ప్రియమింద్రస్య దేవస్య మనోర్వైవస్వతస్య చ॥ 5
ఆ భారత వర్షాన్ని గురించి ఇపుడు చెపుతాను. ఇది ఇంద్రునికీ, వైవస్వత మనువుకూ ప్రియమైనది. (5)
పృథోస్తు రాజన్ వైన్యస్య తథేక్ష్వాకోర్మహాత్మనః ।
యయాతేరంబరీషస్య మాంధాతుర్నహుషస్య చ ॥ 6
వేనుని కొడుకయిన పృథుమహారాజుకు, ఇక్ష్వాకునికీ, యయాతికీ, అంబరీషునికీ, మాంథాతకూ, నహుషునికీ కూడా ప్రియమైనది. (6)
తథైవ ముచుకుందస్య శిబేరౌశీనరస్య చ ।
ఋషభస్య తథైలస్య నృగస్య నృపతేస్తథా ॥ 7
కుశికస్య చ దుర్ధర్ష గాధేశ్చైవ మహాత్మనః ।
సోమకస్య చ దుర్ధర్ష దిలీపస్య తథైవ చ ॥ 8
అన్యేషాం చ మహారాజ క్షత్రియాణాం బలీయసామ్ ।
సర్వేషామేవ రాజేంద్ర ప్రియం భారత భారతమ్ ॥ 9
అలాగే ముచుకుందుడు, ఉశీనర పుత్రుడయిన శిబి, ఋషుభుడు పురూరవుడు, నృగుడు, కుశికుడు, గాధి, సోమకుడు, దిలీపుడు - ఇంకా బలీయులైన ఇతర రాజులకు అందరకూ భారత వర్షం అంటే చాలా ఇష్టం. (7-9)
తత్ తే వర్షం ప్రవక్ష్యామి యథాయథమరిందమ ।
శృణు మే గదతో రాజన్ యన్మాం త్వం పరిపృచ్ఛసి ॥ 10
రాజా! అరిందమా! దాన్ని గురించి అడిగావు కదా! ఉన్నదున్నట్లు భారత వర్షం గురించి చెపుతాను విను. (10)
మహేంద్రో మలయః సహ్యః శుక్తిమానృక్షవానపి ।
వింధ్యశ్చ పారియాత్రశ్చ సప్తైతే కులపర్వతాః ॥ 11
మహేంద్రం, మలయం, సహ్యం శుక్తిమంతం ఋక్షవంతం, వింధ్యం పారియాత్రం ఈ ఏడూ కుల పర్వతాలు. (11)
తేషాం సహస్రశో రాజన్ పర్వతాస్తే సమీపతః ।
అవిజ్ఞాతాః సారవంతః విపులాశ్చిత్రసానవః ॥ 12
రాజా! వీటి సమీపంలో తెలియకుండా ఇంకా ఎన్నో వేలకొద్దీ పర్వతాలు ఉన్నాయి. అవి అన్నీ సారవంతాలు, విశాలమయిన చిత్ర శిఖరాలతో శోభిల్లేవి. (12)
అన్యే తతోఽపరిజ్ఞాతాః హ్రస్వా హ్రస్వోపజీవినః ।
ఆర్యా మ్లేచ్ఛాశ్చ కౌరవ్య తైర్మిశ్రాః పురుషా విభో ॥ 13
నదీం పిబంతి విపులాం గంగాం సింధుం సరస్వతీమ్ ।
గోదావరీం నర్మదాం చ బాహుదాం చ మహానదీమ్ ॥ 14
శతద్రూం చంద్రభాగాం చ యమునాం చ మహానదీమ్ ।
దృషద్వతీం విపాశాం చ విపాపాం స్థూలవాలుకామ్ ॥ 15
నదీం వేత్రవతీం చైవ కృష్ణవేణాం చ నిమ్నగామ్ ।
ఇరావతీం వితస్తాం చ పయోష్ణీం దేవికామపి ॥ 16
వేదస్మృతాం వేదవతీం త్రిదివామిక్షులాం కృమిమ్ ।
కరీషిణీం చిత్రవాహాం చిత్రసేనాం చ నిమ్నగామ్ ॥ 17
ఇంకా చాలా తెలియని పర్వతాలున్నాయి. వాటి మీద చిన్న చిన్న ప్రాణులున్నాయి. ఈ భారత వర్షంలో ఆర్యులు, మ్లేచ్ఛులు, సంకరజాతులు ఉన్నారు. ఎన్నో నదుల నీరు త్రాగుతున్నారు. ఆ నదుల పేర్లు ఇవి. గంగ, సింధువు, సరస్వతి, గోదావరి, నర్మద, బాహుద, మహానది, శతద్రువు, చంద్రభాగ, యమున, దృషద్వతి, విపాశ, విపాప, స్థూలవాలుక, వేత్రవతి, కృష్ణవేణ, ఇరావతి, వితస్త, పయోష్ణి, దేవిక, వేదస్మృత, వేదవతి, త్రిదివ, ఇక్షుల, కృమి, కరీషిణి చిత్రవాహ, చిత్రసేన ఉన్నాయి. (13-17)
గోమతీం ధూతపాపాం చ వందనాం చ మహానదీమ్ ।
కౌశికీం త్రిదివాం కృత్యాం నిచితాం లోహితారణీమ్ ॥ 18
రహస్యాం శతకుంభాం చ సరయూం చ తథైవ చ ।
చర్మణ్వతీం వేత్రవతీం హస్తిసోమాం దిశం తథా ॥ 19
శరావతీం పయోష్ణీం చ వేణాం భీమరథీమపి ।
కావేరీం చులుకాం చాపి వాణీం శతబలామపి ॥ 20
ఇంకా గోమతి, ధూతపాప, వందన, కౌశికి, త్రిదివ, కృత్య, నిచిత, లోహితారణి, రహస్య, శతకుంభ, సరయు, చర్మణ్వతి, వేత్రవతి, హస్తిసోమ, దిశ, శరావతి, పయోష్ణి, వేణ, భీమరథి, కావేరి, చులుక వాణి, శతబల కూడా ఉన్నాయి. (18-20)
నీవారామహితాం చాపి సుప్రయోగాం జనాధిప ।
పవిత్రాం కుండలీం సింధుం రాజనీం పురమాలినీమ్ ॥ 21
పూర్వాభిరామాం వీరాం చ భీమామోఘవతీం తథా ।
పాశాశినీం పాపహరాం మహేంద్రాం పాటలావతీమ్ ॥ 22
కరీషిణీమసిక్నీం చ కుశచీరాం మహానదీమ్ ।
మకరీం ప్రవరాం మేనాం హేమాం ఘృతవతీం తథా ॥ 23
పురావతీమనుష్ణాం చ శైబ్యాం కాపీం చ భారత ।
సదానీరామధృష్యాం చ కుశధారాం మహానదీమ్ ॥ 24
ఇంకా నీవార, అహిత, సుప్రయోగ, పవిత్ర, కుండలి, సింధువు, రాజని, పురమాలిని, పూర్వాభిరామ, వీర, భీమ, ఓఘవతి, పాశాశిని, పాపహర, మహేంద్ర, పాటలావతి, కరీషిణి, అసిక్ని, కుశచీర, మకరి, ప్రవర, మేన, హేమ, ఘృతవతి, పురావతి, అనుష్ణ, శైబ్య, కాపి, సదానీర, అధృష్య, కుశధార అనే నదులూ ఉన్నాయి. (21-24)
సదాకాంతాం శివాం చైవ తథా వీరమతీమపి ।
వస్త్రాం సువస్త్రాం గౌరీం చ కంపనాం సహిరణ్వతీమ్ ॥ 25
వరాం వీరకరాం చాపి పంచమీం చ మహానదీమ్ ।
రథచిత్రాం జ్యోతిరథాం విశ్వామిత్రాం కపింజలామ్ ॥ 26
ఉపేంద్రాం బహులాం చైవ కువీరామంబువాహినీమ్ ।
వినదీం పింజలాం వేణాం తుంగవేణాం మహానదీమ్ ॥ 27
విదిశాం కృష్ణవేణాం చ తామ్రాం చ కపిలామపి ।
ఖలుం సువామాం వేదాశ్వాం హరిశ్రావాం మహాపగామ్ ॥ 28
శీఘ్రాం చ పిచ్ఛిలాం చైవ భారద్వాజీం చ నిమ్నగామ్ ।
కౌశికీం నిమ్నగాం శోణాం బాహుదామథ చంద్రమామ్ ॥ 29
దుర్గాం చిత్రశిలాం చైవ బ్రహ్మవేధ్యాం బృహద్ వతీమ్ ।
యవక్షా మథ రోహీం చ తథా జాంబూనదీమపి ॥ 30
ఇంకా సదాకాంత, శివ, వీరమతి, వస్త్ర, సువస్త్ర, గౌరి, కంపన, హిరణ్వతి, వర, వీరకర, పంచమి, మహానది, రథచిత్ర, జ్యోతిరథ, విశ్వామిత్ర, కపింజల, ఉపేంద్ర, బహుల, కువీర, అంబువాహిని, వినది, పింజల, వేణ, తుంగవేణ, విదిశ, కృష్ణవేణ, తామ్ర, కపిల, ఖలువు, సువామ, వేదాశ్వ, హరిశ్రావ, మహాపగ, శీఘ్ర, పిచ్ఛిల, భారద్వాజి, కౌశికి, శోణ బాహుద, చంద్రమ, దుర్గ, చిత్రశిల, బ్రహ్మవేధ్య, బృహద్వతి, యవక్ష, రోహి, జాంబూనది అనేవి ఉన్నాయి. (25-30)
సునసాం తమసాం దాసీం వసామన్యాం వరాణసీమ్ ।
నీలాం ఘృతవతీం చైవ పర్ణాశాం చ మహానదీమ్ ॥ 31
మానవీం వృషభాం చైవ బ్రహ్మమేధ్యాం బృహద్ధనిమ్ ।
ఏతాశ్చాన్యాశ్చ బహుధాః మహానద్యో జనాధిప ॥ 32
సునస, తమస, దాసి, వస, వరాణసి, నీల ఘృతవతి, పర్ణాశ, మానవి, వృషభ, బ్రహ్మమేధ్య, బృహద్ధని - ఇంకా ఎన్నో పెద్ద నదులున్నాయి. (31,32)
సదా నిరామయాం కృష్ణాం మందగాం మందవాహినీమ్ ।
బ్రాహ్మణీం చ మహాగౌరీం దుర్గామపి చ భారత ॥ 33
చిత్రోపలాం చిత్రరథాం మంజులాం వాహినీం తథా ।
మందాకినీం వైతరణీం కోషాం చాపి మహానదీమ్ ॥ 34
శుక్తిమతీమనంగాం చ తథైవ వృషసాహ్వయామ్ ।
లోహిత్యాం కరతోయాం చ తథైవ వృషకాహ్వయామ్ ॥ 35
కుమారీమృషికుల్యాం చ మారిషాం చ సరస్వతీమ్ ।
మందాకినీం సుపుణ్యాం చ సర్వాం గంగాం చ భారత ॥ 36
ఇంకా సదానిరామయ, కృష్ణ, మందగ, మందవాహిని, బ్రాహ్మణి, మహాగౌరి, దుర్గ, చిత్రోపల, చిత్రరథ, మంజుల, వాహిని, మందాకిని, వైతరణి, కోష, శుక్తిమతి, అనంగ, వృష, లోహిత్య, కరతోయ, వృషక, కుమారి, ఋషికుల్య, మారిష, సరస్వతి, మందాకిని, సుపుణ్య, సర్వ, గంగ అనే నదులూ ఉన్నాయి. (33-36)
విశ్వస్య మాతరః సర్వాః సర్వాశ్చైవ మహాఫలాః ।
తథా నద్యస్త్వప్రకాశాః శతశోఽథ సహస్రశః ॥ 37
ఈ నదులన్నీ తల్లుల వంటివి. మహాఫలం ఇస్తాయి. ఇంకా వందలకొద్ధీ, వేలకొద్దీ నదులు ప్రజలకు తెలియకుండా/అపరిచితంగా ఉన్నాయి. (37)
ఇత్యేతాః సరితో రాజన్ సమాఖ్యాతా యథాస్మృతి ।
అత ఊర్ధ్వం జనపదాన్ నిబోధ గదతో మమ ॥ 38
నాకు గుర్తున్నంతవరకు నదులను చెప్పాను. ఇక భారత వర్షంలోని దేశాలను చెపుతా విను. (38)
తత్రేమే కురుపాంచాలాః శాల్వా మాద్రేయజాంగలాః ।
శూరసేనాః పులిందాశ్చ బోధా మాలాస్తథైవ చ ॥ 39
మత్స్యాః కుశల్యాః సౌశల్యాః కుంతయః కాంతికోసలాః ।
చేదిమత్స్యకరూష్యాశ్చ భోజాః సింధుపులిందకాః ॥ 40
ఉత్తమాశ్వదశార్ణాశ్చ మేకలాశ్చోత్కలైః సహ ।
పంచాలాః కోసలాశ్చైవ నైకపృష్ఠా ధురంధరాః ॥ 41
గోధామద్రకలింగాశ్చ కాశయోఽపరకాశయః ।
జఠరాః కుక్కురాశ్చైవ సదశార్ణాశ్చ భారత ॥ 42
కుంతయోఽవంతయశ్చైవ తథైవాపరకుంతయః ।
గోమంతా మండకాః సండాః విదర్భా రూపవహికాః ॥ 43
అశ్మకాః పాండురాష్టాశ్చ గోపరాష్ట్రాః కరీతయః ।
అధిరాజ్యకుశాద్యాశ్చ మల్లరాష్ట్రం చ కేవలమ్ ॥ 44
కురుపాంచాల, శాల్వ, మాద్రేయ జాంగల, శూరసేన, పులింద, బోధ, మాల మత్స్య, కుశల్య, సౌశల్య, కుంతి, కాంతి, కోసల, చేది మత్స్య, కరూష, భోజ, సింధు, పులిందక, ఉత్తమాశ్వ, దశార్ణ, మేకల, ఉత్కల, పంచాల, కోసల, నైకపృష్ఠ, ధురంధర, గోధా, మద్ర, కళింగ, కాశి, అపరకాశి, జఠర, కుక్కుర, దశార్ణ, కుంతి, అవంతి, అపరకుంతి, గోమంత, మండక, సండ, విదర్భ, రూపవాహిక, అశ్మక, పాండురాష్ట్ర, గోపరాష్ట్ర, కరీతి, అధిరాజ్య, కుశాద్య, మల్లరాష్ట్ర నామక దేశాలున్నాయి. (39-44)
వారవాస్యాయవాహాశ్చ చక్రాశ్చక్రాతయః శకాః ।
విదేహా మగధాః స్వక్షాః మలజా విజయాస్తథా ॥ 45
అంగా వంగాః కలింగాశ్చ యకృల్లోమాన ఏవ చ ।
మల్లాః సుదేష్ణాః ప్రహ్లాదా మాహికాః శశికాస్తథా ॥ 46
బాహ్లికా వాటధానాశ్చ ఆభీరాః కాలతోయకాః ।
అపరాంతాః పరాంతాశ్చ పంచాలాశ్చర్మమండలాః ॥ 47
అటవీశిఖరాశ్చైవ మేరుభూతాశ్చ మారిష ।
ఉపావృత్తానుపావృత్తాః స్వరాష్ట్రాః కేకయాస్తథా ॥ 48
కుందాపరాంతా మాహేయాః కక్షాః సాముద్రనిఘ్కటాః ।
అంధ్రాశ్చ బహవో రాజన్ అంతర్గిర్యాస్తథైవ చ ॥ 49
బహిర్గిర్యాంగమలజా మగధా మానవర్జకాః ।
సమంతరాః ప్రావృషేయాః భార్గవాశ్చ జనాధిప ॥ 50
ఇంకా వారవాస్య, అయవాహ, చక్ర, చక్రాతి, శక, విదేహ, మగధ, స్వక్ష, మలజ, విజయ, అంగ, వంగ, కలింగ, యకృల్లోమ, మల్ల, సుదేష్ణ, ప్రహ్లాద, మాహిక, శశిక బాహ్లిక, వాటధాన, ఆభీర, కాలతోయక, అపరాంత, పరాంత, పంచాల, చర్మమండల, అటవీశిఖర, మేరుభూత, ఉపావృత్త, అనుపావృత్త, స్వరాష్ట్ర, కేకయ, కుందాపరాంత, మాహేయ, కక్ష, సాముద్రనిష్కుట, అంధ్ర, అంతర్గిరి, బహిర్గిరి, అంగమలజ, మగధ, మానవర్జక, సమంతర, ప్రావృషేయ, భార్గవ దేశాలున్నాయి. (45-50)
పుండ్రా భర్గాః కిరాతాశ్చ సుదృష్టా యామునాస్తథా ।
శకా నిషాదా నిషధాః తథైవానర్తనైర్ ఋతాః ॥ 51
దుర్గాలాః ప్రతిముత్స్యాశ్చ కుంతలాః కోసలాస్తథా ।
తీరగ్రహాః శూరసేనాః ఈజికాః కన్యకాగుణాః ॥ 52
తిలభారా మసీరాశ్చ మధుమంతః సుకందకాః ।
కాశ్మీరాః సింధుసౌవీరా గాంధారా దర్శకాస్తథా ॥ 53
అభీసారా ఉలూతాశ్చ శైవలా బాహ్లికాస్తథా ।
దార్వీ చ వానవా దర్వా వాతజామరథోరగాః ॥ 54
బహువాద్యాశ్చ కౌరవ్య సుదామానః సుమల్లికాః ।
వధ్రాః కరీషకాశ్చాపి కులిందోపత్యకాస్తథా ॥ 55
వనాయవో దశాపార్శ్వరోమాణః కుశబిందవః ।
కచ్ఛా గోపాలకక్షాశ్చ జాంగలాః కురువర్ణకాః ॥ 56
కిరాతా బర్బరాః సిద్ధాః వైదేహాస్తామ్రలిప్తకాః ।
ఓండ్రా మ్లేచ్ఛాః సైసిరిధ్రాః పార్వతీయాశ్చ మారిష ॥ 57
ఇంకా పుండ్ర, భర్గ, కిరాత, సుదృష్ట, యామున, శక, నిషాద, నిషధ, ఆనర్త, నైరృత, దుర్గాల, ప్రతిమత్స్య, కుంతల, కోసల, తీరగ్రహ, శూరసేన, ఈజిక, కన్యకాగుణ, తిలభార, మసీర, మధుమంత, సుకందక, కాశ్మీర, సింధుసౌవీర, గాంధార, దర్శక, అభీసార, ఉలూత, శైవల, బాహ్లిక, దార్వీ, వానవ, దర్వ, వాతజ, ఆమరథ, ఉరగ, బహువాద్య, సుదామ సుమల్లిక, వధ్ర, కరీషక, కుళింద, ఉపత్యక, వనాయు, దశ, పార్శ్వరోమ, కుశబిందు, కచ్ఛ, గోపాలకక్ష, జాంగల, కురు వర్ణక, కిరాత, బర్బర, సిద్ధ, వైదేహ, తామ్రలిప్త, ఓండ్ర, మ్లేచ్ఛ, సైసిరిధ్ర, పార్వతీయ దేశాలున్నాయి. (51-57)
అథాపరే జనపదాః దక్షిణా భరతర్షభ ।
ద్రవిడాః కేరలాః ప్రాచ్యా భూషికా వనవాసికాః ॥ 58
కర్ణాటకా మహిషకాః వికల్పా మూషకాస్తథా ।
ఝిల్లికాః కుంతలాశ్చైవ సౌహృదా నభకాననాః ॥ 59
కౌకుట్టకాస్తథా చోలాః కోంకణా మాలవా నరాః ।
సమంగాః కరకాశ్చైవ కుకురాంగరమారిషాః ॥ 60
ధ్వజిన్యుత్సవసంకేతాః త్రిగర్తాః శాల్వసేనయః ।
వ్యూకాః కోకబకాః ప్రోష్ఠాః సమవేగవశాస్తథా ॥ 61
తథైవ వింధ్యచులికాః పులిందా వల్కలైః సహ ।
మాలవా బల్లవాశ్చైవ తథైవాపరబల్లవాః ॥ 62
కులిందాః కాలదాశ్చైవ కుండలాః కరటాస్తథా ।
మూషకాః స్తనబాలాశ్చ సనీపా ఘటసృంజయాః ॥ 63
అఠిదాః పాశివాటాశ్చ తనయాః సునయాస్తథా ।
ఋషికా విదభాః కాకాః తంగణాః పరతంగణాః ॥ 64
ఉత్తరాశ్చాపరమ్లేచ్ఛాః క్రూరా భరతసత్తమ ।
యవనాశ్చీనకాంబోజాః దారుణా మ్లేచ్ఛజాతయః ॥ 65
ఇంకా దక్షిణ దేశాలున్నాయి. అవి ద్రవిడ, కేరల, ప్రాచ్య, భూషిక, వనవాసిక, కర్ణాటక, మహిషక, వికల్ప, మూషక, ఝిల్లిక, కుంతల, సౌహృద, నభకానన, కౌకుట్టక, చోల, కోంకణ, మాలవ, నర సమంగ, కరక, కుకుర, అంగార, మారిష, ధ్వజినీ, ఉత్సవసంకేత, త్రిగర్త, శాల్వసేని, వ్యూక, కోకబక, ప్రోష్ఠ, సమవేగవశ, వింధ్య, చుళిక, పుళింద, వల్కల, మాలవ, బల్లవ, అపరబల్లవ, కుళింద, కాలద, కుండల, కరట, మూషక, స్తనబాల, సనీప, ఘట, సృంజయ, అఠిద, పాశివాట, తనయ, సునయ, ఋషిక, విదభ, కాక, తంగణ, పరతంగణ, నామంకలవి, ఉత్తర అపరమ్లేచ్ఛ, యవన, చీను, కాంబోజులు, దారుణమైన మ్లేచ్ఛజాతులున్నాయి. (58-65)
సకృద్ గ్రహాః కులత్థాశ్చ హూణాః పారిసికైః సహ ।
తథైవ రమణాశ్చీనాః తథైవ దశమాలికాః ॥ 66
క్షత్రియోపనివేశాశ్చ వైశ్యశూద్రకులాని చ ।
శూద్రాభీరాశ్చ దరదాః కాశ్మీరాః పశుభిః సహ ॥ 67
ఖాళీరాశ్చాంతచారాశ్చ పహ్లవా గిరిగహ్వరాః ।
ఆత్రేయాః సభరద్వాజాః తథైవ స్తనపోషికాః ॥ 68
ప్రోషకాశ్చ కలింగాశ్చ కిరాతానాం చ జాతయః ।
తోమరా హన్యమానశ్చ తథైవ కరభంజకాః ॥ 69
ఇంకా సకృద్గ్రహ, కులత్థ, హూణ, పారిసిక, రమణ - చీన, దశమూలిక దేశాలున్నాయి. ఇంకా క్షత్రియ నివేశాలు, వైశ్యశూద్రకులాలు ఉన్నాయి. ఆభీర, దరద, కాశ్మీర, పశు, ఖాశీర, అంతచార, పహ్లవ, గిరి, గహ్వర, ఆత్రేయ, భరద్వాజ, స్తన పోషిక, ప్రోషక, కలింగ, కిరాత జాతుల జనపదాలు ఉన్నాయి. తోమర, హన్యమాన, కరభంజక దేశాలు కూడా ఉన్నాయి. (66-69)
ఏతే చాన్యే జనపదాః ప్రాచ్యోదీచ్యాస్తథైవ చ ।
ఉద్దేశమాత్రేణ మయా దేశాః సంకీర్తితా విభో ॥ 70
యథాగుణబలం చాపి త్రివర్గస్య మహాఫలమ్ ।
దుహ్యేత ధేనుః కామధుగ్ భూమిః సమ్యగనుష్ఠితా ॥ 71
ఇవేగాక ఇంకా తూర్పు, ఉత్తరదిక్కుల గ్రామాలు, దేశాలు ఉన్నాయి. రాజులు తమ గుణాలనూ, బలాన్ని బట్టి చక్కగా పరిపాలిస్తే ఈ భూమి కామధేనువై ధర్మ, అర్థ కామాలు అనే త్రివర్గ మహాఫలం ఇస్తుంది. (70-71)
తస్యాం గృద్ధ్యంతి రాజానః శూరా ధర్మార్థకోవిదాః ।
తే త్యజంత్యాహవే ప్రాణాన్ వసుగృద్ధాస్తరస్వినః ॥ 72
ఆ భూమికోసమే ధర్మార్థ కోవిదులయిన రాజులు, ధనలోభంతో యుద్ధం చేసి ప్రాణాలు విడుస్తారు. (72)
దేవమానుషకాయానాం కామం భూమిం పరాయణమ్ ।
అన్యోన్యస్యావలుంపంతి సారమేయా యథామిషమ్ ॥ 73
రాజానో భరతశ్రేష్ఠ భోక్తుకామా వసుంధరామ్ ।
న చాపి తృప్తిః కామానాం విద్యతేఽద్యాపి కస్యచిత్ ॥ 74
దేవతలకూ, మానవులకూ కూడా కోరిన కోరిక లిచ్చేది ఈ భూమియే. దీనికోసం మాంసం కోసం కుక్కలు పోట్లాడుకొన్నట్లు రాజులు పోరు సాగిస్తారు. అయినా ఎవరి కోరికలకూ తృప్తి కలగటం లేదు. (73,74)
తస్మాత్ పరిగ్రహే భూమేః యతంతే కురుపాండవాః ।
సామ్నా భేదేన దానేన దండేనైవ చ భారత ॥ 75
ఇప్పటికీ ఈ అసంతృప్తి చేతనే కురుపాండవులు సామభేద దాన దండోపాయాలతో భూమిని పొందటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. (75)
పితా భ్రాతా చ పుత్రాశ్చ ఖం ద్యౌశ్చ నరపుంగవ ।
భూమిర్భవతి భూతానాం సమ్యగచ్ఛిద్రదర్శనా ॥ 76
ఈ భూమి యొక్క నిజస్వరూపం తెలిస్తే ఇది పరమాత్మ స్వరూపం కాబట్టి ఈ భూమియే అందరికీ తండ్రిగా, సోదరుడుగా, పుత్రుడుగా, ఆకాశంగా అయి సుఖపెడుతుంది." (76)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి జంబూఖండవినిర్మాణపర్వణి భారతీయనదీదేశాదినామకథనే నవమోఽధ్యాయః ॥ 9 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున జంబూఖండవినిర్మాణ పర్వమను ఉపపర్వమున భారతీయ నదీ దేశనామములు చెప్పుట అను తొమ్మిదవ అధ్యాయము. (9)